నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఒక మహిళను లైంఘిక వేధింపులకు, అవమానానికి గురి చేసిన గైని కిరణ్ కు మూడు, రెండు సంవత్సరాల చొప్పున జైలుశిక్షలు విదిస్తూ మహిళలపై అత్యాచారాలను విచారించే ప్రత్యేక న్యాయస్థానం నిజామాబాద్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి హరీష శుక్రవారం తీర్పు చెప్పారు.కోర్టు వెలువరించిన ఇరవై ఏడు పేజీల తీర్పులో రెంజల్ పోలీస్ స్టేషన్ నేర విచారణ అధికారి సాయన్న కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం అదారంగా కోర్టు నేర న్యాయ విచారణ భాగంగా మొత్తం ఎనిమిది మంది సాక్షుల సాక్ష్యాలు నమోదు చేసుకుని, ఆరు ధ్రువీకరించుకున్న పత్రాలు మార్క్ చేసిన అనంతరం వాటిని అధ్యయనం చేసిన పిదప నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో నివసించే గైని కిరణ్ 14 ఏప్రిల్, 2023 న సాయంత్రం ఆరు గంటలకు అదే గ్రామానికి ఒక మహిళ ఇంటిలోని వెల్లి ఆమెను లైంఘిక వేధింపులకు, అవమానానికి గురి చేశాడనే నేర అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు అయినట్లు ప్రకటించారు.భారత శిక్షస్కృతి సెక్షన్ 354 ఏ(1)(ఐ) లైంఘిక వేధింపుల నేరంకుగాను మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు ఐదు వేల రూపాయల జరిమానా, సెక్షన్ 509 మహిళను నేర పూరిత చర్య ద్వారా అవమానించడంకుగాను రెండు సంవత్సరాల సాధారణ జైలుశిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించారు. రెండు శిక్షలు ఏక కాలంలో అనుభవించాలని జడ్జి హరీష తమ తీర్పులో పేర్కొన్నారు.
- బాధిత మహిళకు రూ.50 వేల పరిహారానికి సిపార్సు.
బాధిత మహిళ మగవ్యక్తిచే లైంఘిక వేధింపులకు గురి అయిన నేపథ్యంలో ఆమెకు బాధితుల పరిహారం పథకం అనుసారం 50 వేల రూపాయల పరిహారం అందజేయాలని జడ్జి హరీష తమ తీర్పులో జిల్లా న్యాయసేవ అధికార సంస్థకు సిపార్సు చేశారు.
