28.2 C
Hyderabad

జమాత్ ఖానా గ్రౌండ్ లో వ్యక్తిపై కత్తి తో దాడి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ  :  నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కోజా కాలనీలో వ్యక్తిపై గతరాత్రి కత్తితో దాడి జరిగింది.  వివరాల్లోకి వెళ్తే… మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు షాబాజ్ అనే యువకుడి తమ్ముడిని షేక్ అక్బర్ ను ఆటోలో బలవంతంగా తీసుకెళ్లి కొట్టారు. ఈ వివాదం జరుగుతుండగా, షాబాజ్ గొడవను ఆపడానికి   కోజా కాలనీలోని జమత్ ఖానా గ్రౌండ్ కు వెళ్లాడు. అకస్మాత్తుగా లడ్డా అనే వ్యక్తి జాంబియా (కత్తి)తో షాబాజ్‌పై దాడి చేశాడు, ఈ దాడిలో షాబాజ్  ఛాతీపై గాయమైంది. షాబాజ్ కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, కత్తిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

More articles

Latest article