29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

లారీని ఢీకొన్న కంటెయినర్ : డ్రైవర్ మృతి

Must read

📰 Generate e-Paper Clip

44 వజాతీయ రహదారి టేక్రియాల్ వద్ద ఘటన

కామారెడ్డి, బతుకమ్మ : లారీని వెనుక నుంచి వస్తున్న కంటెయినర్ వాహనం ఢీకొన్న ఘటన కామారెడ్డికి సమీపంలోని 44 వజాతీయ రహదారి టేక్రియాల్ వద్ద చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాలు..  నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన లారీని, రాజస్థాన్​కు చెందిన కంటెయినర్ వాహనం వెనక నుంచి వేగంగా వచ్చి టేక్రియాల్​ వద్ద బుధవారం తెల్లవారుజామున ఢీకొంది. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం కావడంతో పోలీసులు లారీలను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈప్రమాదంలో కంటెయినర్ వాహనం క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది. అందులో చిక్కుకున్న డ్రైవర్, క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందాడు. క్లీనర్​ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article