30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

అక్రమంగా పాములను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

 

వరంగల్, బతుకమ్మ :

 

వరంగల్‌లో అక్రమంగా అరుదైన పాముల విక్రయం చేస్తున్న వ్యక్తిని డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అండర్‌కవర్ డీకాయ్ ఆపరేషన్ నిర్వహించిన అధికారులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా రెండు అరుదైన ఇండియన్ రెడ్ శాండ్ బోవా పాములు స్వాధీనం అయ్యాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం ఈ జాతికి చెందిన పాములను కలిగి ఉండటం, విక్రయించడం నేరమని అధికారులు తెలిపారు. వరంగల్ గ్రే మార్కెట్‌లో రహస్యంగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారాన్ని డీఆర్‌ఐ అధికారులు వెలుగులోకి తీసుకువచ్చారు. అరెస్ట్ చేసిన నిందితుడిని, స్వాధీనం చేసిన పాములను అనంతరం ఫారెస్ట్ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న అక్రమ వన్యప్రాణుల రవాణా ముఠాలపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

More articles

Latest article