ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలం మలపాటి గ్రామ సర్పంచ్ అశ్విని రాజు, ఉపసర్పంచ్ కొమ్ముల సాయిలుతో పాటు పలువురు స్థానిక నాయకులు గురువారం ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో వార్డు సభ్యుడు కంపె శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ కంపె రాజయ్య, కామ గోపాల్, కంపె సాయిరాం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నూతనంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. నియోజకవర్గంలో ఆయన చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు వెల్లడించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, పార్టీలో చేరిన నాయకులకు స్వాగతం పలుకుతూ, ప్రజాసేవకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులు సమష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి రఫీయొద్దీన్, నాయకులు హర్షద్, బీసీ సెల్ అధ్యక్షుడు దూరిశెట్టి అశోక్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ చాకలి కుమార్, ఏదుల్ పాషా, షట్పల్లి సంగారెడ్డి సర్పంచ్ అంజయ్య, రైతు కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.