కాంగ్రెస్‌లో చేరిన మలపాటి సర్పంచ్ అశ్విని రాజు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలం మలపాటి గ్రామ సర్పంచ్ అశ్విని రాజు, ఉపసర్పంచ్ కొమ్ముల సాయిలుతో పాటు పలువురు స్థానిక నాయకులు గురువారం ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో వార్డు సభ్యుడు కంపె శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ కంపె రాజయ్య, కామ గోపాల్, కంపె సాయిరాం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నూతనంగా...