29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను విజయవంతం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అంగన్వాడి జిల్లా నాయకుల పిలుపు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఈ నెల 12న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపులో భాగంగా అంగన్వాడీ ఉద్యోగులు కూడా సమ్మె లో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ. రమేష్ బాబు అన్నారు. మంగళవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు జిల్లా కమిటీ అంగన్వాడి సమస్యలను జిల్లా ఈసీడిఎస్ పిడి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను మారుస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావడం జరిగిందని, వీటి మూలంగా కార్మికులు తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగులకు ఎనిమిది సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల వేతనాలు పెంచి ఇంతవరకు కనీస వేతనాలు అమలు జరపకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారన్నారు. అందువల్ల అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు జరపాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను టీచర్ కి ఐదు లక్షలు, ఆయాకు మూడు లక్షలు చెల్లించాలని, పెన్షన్ వేతనాల లో సగం నెల నెల చెల్లించాలని వారసత్వపు హక్కును కల్పించాలని తదితర డిమాండ్లతో జరిగే సమ్మెలో జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చే పద్ధతుల్లో నిర్ణయాలు చేయడంతో పాటు కార్మికుల పని గంటలను పెంచుతూ నిర్ణయించటం సరైనది కాదని ఆయనన్నారు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై అజమాయిషి చేయటానికి ప్రజా ప్రతినిధులకు బాధ్యతలు అప్పగించడం వలన వేధింపులు పెరుగుతాయని వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు కే. దేవగంగు, ప్రధాన కార్యదర్శి పి. స్వర్ణ, కోశాధికారి పి .చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షులు మంగాదేవి, జిల్లా నాయకులు జ్యోతి, జగదాంబ, యమునా, చంద్రకళ తదితరులతో పాటు ప్రాజెక్టు నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article