33.2 C
Hyderabad

పీడీఎస్యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని విజయవంతం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఫిబ్రవరి 4 ,5 తేదీల్లో భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగు పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కళాశాల ముందు వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  నిజామాబాద్ జిల్లా పి.డి.ఎస్.యు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం. నరేందర్, డాక్టర్ కర్క గణేష్ లు మాట్లాడుతూ  దేశంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య రంగా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 7500 కోట్ల రూపాయల స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో లక్షలాదిమంది పేద విద్యార్థులు ఆర్థికపరమైన అవస్థలు పడుతున్నారని తెలిపారు.  కేంద్రంలో నరేంద్ర మోడీ, యుజిసి అధికారులు రాస్ట్రాలలోని ప్రభుత్వ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే సంస్కరణలు తీసుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. నిజామబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్. అనిల్ కుమార్, కోశాధికారి నిఖిల్, జిల్లా నాయకులు వినోద్,నాగేష్, సునీల్,సంతోష్, ప్రసాద్,వంశీ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article