24.7 C
Hyderabad
Monday, August 3, 2026

గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

పోచంపాడ్,  బతుకమ్మ : ఎండు గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని గురువారం అరెస్ట్ చేసినట్లు ప్రొహిబిషెన్, ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ కె.స్టీవెన్సన్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. పోచంపాడ్ ఎక్స్ రోడ్, పోచంపాడ్ ఎన్ హెచ్ 44వద్ద గురువారం ఉదయం ఎక్సైజ్ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో నిర్మల్ నుంచి ఆర్మూర్ వైపు నేరేడు గొండ మండలం లింగట్ల గ్రామానికి చెందిన సబ్లె ప్రకాష్, బరదవల్ గవస్కర్ అనే వ్యక్తులు తమ ద్విచక్రవాహనం పై వస్తున్నారు. ఎక్సైజ్ అధికారలు అనుమానంతో వారి వాహనాన్నితనిఖీ చేశారు. వారి వద్ద నుంచి 1.300కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే పట్టకుని విచారించగా ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడుగొండ నుంచి గుర్తుతెలియని వ్యక్తి వద్ద కొనుగోలు చేసి పోచంపాడ్ యువకులకు ఎక్కువ డబ్బుకు విక్రయిస్తున్నామని తెలిపారు. దీంతో వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1.300కేజీల ఎండు గంజాయి, ఒక ద్వి చక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. యువత ఎండు గంజాయిని సేవిస్తూ దురలవాట్లకు బానిస కాకూడదని సూచించారు. అక్రమంగా ఎండు గంజాయిని రవాణా చేయడం కానీ,కలిగి ఉండడం కానీ నేరమని అట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఈ దాడిలో ఎస్ఐ.చంద్రమౌళి, సిబ్బంది సాయిలు, వికాస్ గౌడ్, సందీప్, నరేష్, ధర్మేందేర్, శ్రీనివాస్, సాగర్ పాల్గొన్నారు.

More articles

Latest article