పీడీఎస్యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని విజయవంతం చేయండి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఫిబ్రవరి 4 ,5 తేదీల్లో భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగు పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కళాశాల ముందు వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పి.డి.ఎస్.యు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం. నరేందర్, డాక్టర్ కర్క గణేష్ లు మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య రంగా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు....