విదేశీ ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

0 8,770

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ, ఉపాధి, శిక్షణ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడే విదేశీ ఉద్యోగమేళా ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. న్యూజిలాండ్, జర్మనీ, జపాన్, ఇజ్రాయిల్, దుబాయ్, కువైట్, ఒమన్ తదితర దేశాలలో ఉన్న ఇంజనీర్స్, టెక్నీషియన్స్,  సూపర్వైజర్స్, ఫిజియోథెరపిస్టులు, నర్సెస్, డ్రైవర్స్, బైక్ రైడర్స్, కార్పెంటర్స్, మిషన్ వర్కర్స్, హెల్పర్స్, ప్లంబర్ తదితర ఉద్యోగాల కోసం జూలై మొదటి వారంలో విదేశీ ఉద్యోగమేళాను ఉపాధి, శిక్షణ శాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా ఉపాధి కల్పనాధికారిని వేల్పుల విజేత తెలియజేశారు. విదేశాలలో ఉచితంగా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లుగా, జీతం నెలకి డెబ్భై అయిదు వేల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు ఉంటుందని తెలుపుతూ, దానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, ట్రైనీ కలెక్టర్, డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్, డిఆర్డిఓ, మిగతా జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.