నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 25 మంది మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, 3 మంది టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను నియమించారు. ఈ నియామకాలు బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి సునీల్ రెడ్డి సూచనల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ప్రతిపాదనపై జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి నూతనంగా నియమితులైన మండల, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులకు అభినందనలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకుల సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ సమతుల్యతతో నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. నూతన అధ్యక్షులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామ, మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్ నియోజకవర్గం లో ఆర్మూర్ – నాగరాజు రెడ్డి, మాక్లూర్ – దయాకర్ రావు, ఆలూర్ – ప్రమోద్, నందిపేట్ – దూడ వెంకటేష్, డొంకేశ్వర్ – బాబురావు, ఆర్మూర్ టౌన్ – సాయిబాబా గౌడ్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో మోపాల్ – మంగూరప్ రవి, ఇందల్వాయి – కిషన్ నేత, నిజామాబాద్ రూరల్ – మూత జనార్దన్, డిచ్‌పల్లి – రాథోడ్ అంబర్ సింగ్, ధర్పల్లి – గాదె నరేష్, జక్రాన్‌పల్లి – గడ్డం సంజీవ్ (సురేష్), సిరికొండ – రొండ్ల గోవర్ధన్, బోధన్ నియోజకవర్గం లో సాలూర – రవి, బోధన్ మండల్ – నాగేశ్వర్ రావు, నవీపేట్ – శ్రీనివాస్ గౌడ్, ఎడపల్లి – పులి శ్రీనివాస్, బోధన్ టౌన్ – దామోదర్, రెంజల్ – మొభీన్, బాల్కొండ నియోజకవర్గం లో బాల్కొండ – సాట్ల ప్రవీణ్, భీంగల్ – మల్లెల లక్ష్మణ్, కమ్మర్‌పల్లి – బోనారి భాస్కర్, ఎర్గట్ల – శివకుమార్, మోర్తాడ్ – బక్కూరి ఆనంద్, ముప్కాల్ – కొల్వి శ్రీకాంత్ రెడ్డి, వేల్పూర్ – రంగు అనిల్, మెండోరా – బడాల సాయిరెడ్డి, భీంగల్ టౌన్ – పర్స అనంతరావు లను నియమించినట్టు పేర్కొన్నారు.