23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

కుల నిర్మూలన సదస్సులను జయప్రదం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

 

. . .సిసిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పిలుపు

 మోపాల్, బతుకమ్మ :

కుల నిర్మూలన సదస్సులను జయప్రధం చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) డివిజన్ కార్యదర్శి వేంకన్న తెలిపారు.. అదివారం మోపాల్ మండల కేంద్రంలో సిపిఐ (ఎంఎల్)మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న మాట్లాడుతూ. . . రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 24 నుండి 30 తేదీ వరకు కుల నిర్మూలన సదస్సులు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. పాలకవర్గాలు తమ రాజ్యాధికారం కోసం కులాలతో,మతాలతో ప్రజల మధ్య విద్వేషాలను  రెచ్చగొడుతున్నారన్నారు. కుల నిర్మూల జరగాలంటే కులాంతర వివాహాలు, సహపంక్తి భోజనం ఇతర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో జరిగే కుల నిర్మూలన సదస్సులను ప్రజలు,మేధావులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) డిచ్పల్లి,ఇందల్వాయి మండల కార్యదర్శి మురళి, ప్రగతిశీల వీడి వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి కిషన్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి నారాయణ, అరుణోదయ జిల్లా నాయకులు గంగమల్లు, మోపాల్ మండలం మాస్ లైన్ పార్టీ కార్యదర్శి గంగాధర్, పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article