ఆసరా పింఛన్ దారుల ఆవేదన సభను విజయవంతం చేయండి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వీహచ్పీఎస్ వికలాంగుల పెన్షన్ పెంపు కోసం, ఆసరా, చేయూతదారుల పెన్షన్ పెంపు కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధనపాల్ సూర్యనారాయణ గుప్తా కు సోమవారం వీహెచ్పీఎస్, ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో  మెమోరండం అందజేశారు. ఈ నెల 18న నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల లక్ష్మీ కళ్యాణ మండపంల వీహెచ్పీఎస్ ఉమ్మడి జిల్లా సదస్పు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరు అవుతారని తెలిపారు....