నిజామాబాద్,బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వాసి ఎం.దేవేందర్ సింగ్ ఐఏఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు .ఆదివారం దేవేందర్ సింగ్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అభినందించారు. దేవేందర్ సింగ్ ప్రస్తుతం ముంబై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రత్నగిరి జిల్లా మండన్ గడ్ సివిల్ కోర్టును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్, రత్నగిరి జిల్లా ఇన్చార్జి మంత్రి ఉదయ్ సమంత్, హోం రెవెన్యూ మంత్రి యోగేష్ కదం తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో సీజేఐ బీఆర్ గవాయి దేవేందర్ సింగ్ ను సన్మానించారు. ఎం.దేవేందర్ సింగ్, ఎక్కడ విధులు నిర్వహించినా తన ప్రతిభ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారు. దేవేందర్ సింగ్ మన జిల్లా వాసి కావడం గర్వకారణం.
