25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బోరి లో మేయిన్ మట్కా బూకి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇందూర్ లో మట్కా ప్లేయర్ లలో వణుకు

. . .  పాతిక శాతం ఖాకీలే ప్లేయర్ లు

. . . బుకి పోన్  స్పందించవద్ధని  వాట్సప్ మెసెజ్ లు

ఆదిలాబాద్, బతుకమ్మ:

మహరాష్ట్రలోని బోరి ప్రాంతానికి చెందిన మట్కా ప్రధాన బూకిని ఇటీవల స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అతని సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీస్ లకు ఆన్లైన్ మట్కా  హిస్టరీ కలవరపాటుకు గురి చేసింది. నిత్యం జరిగే చార్టులకు డౌన్లోడ్ లతో పాటు ఆన్లైన్ చెల్లింపులు చూసి షాక్ కు గురయ్యారు. అందులో వందల మంది మట్కా ప్లేయర్ ల నుంచి జరిగిన మట్కా చరిత్ర తో పాటు రోజు జరిగిన యూపీఏ చెల్లింపులు వ్యవహరం బట్ట బయలు అయింది. దానితో ప్రధాన బూకితో రోజు మట్కా ఆడేందుకు యాప్ ల డౌన్ లోడ్ తో పాటు చెల్లింపులు అంతా అదిలాబాద్ జిల్లా తో పాటు నిజామాబాద్ ప్లేయర్ ల  వివరాలు బహిర్గతమైంది. కానీ అప్పటికే అప్రమత్తమైన మట్కా నిర్వాహకులు పోలీసులు ప్రధాన బూకికి సంబంధించిన పోన్ సీజ్ అయిందంటు వాట్సాప్ మెసేజ్ లు పంపిస్తున్నారు. ఇప్పుడు మట్కా ఆన్ లైన్ పోన్ లకు గత రెండు రోజులుగా ఇవే మెసేజ్ లు వస్తుండటంతో పోలీసుల నుంచి ఎక్కడ పిలుపు వస్తుందో అని ప్లేయర్ లు భయపడుతున్నారు. ఇదిలా ఉండగా మట్కా ప్లేయర్ లలో చాల మంది ఖాకీలు( పోలీసులు) కూడా అడుతారని తెలిసి మహా పోలీసులు కుడా షాక్ గురయ్యారు. ప్రధాన బూకి వద్ద దొరికిన ఫోన్ లో సుమారు 40 నుంచి 60 మంది  ఆటగాళ్లు వారే కావడం గమనార్హం. తెలంగాణలో మట్కా, పేకాట నిషేధం ఉండటంతో మహారాష్ట్రకు వెళ్లి అడటం రోజు జరిగే తంతే. కానీ ఆన్ లైన్ మట్కాను, క్రికెట్ బెట్టింగ్ లో సాధారణ ప్రజల మాదిరిగానే పోలీసులు ప్లేయర్ లు గా ఉండటం విస్మయానికి గురి చేస్తోంది.

More articles

Latest article