బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం శేట్ పల్లి గ్రామంలో మాదిగ సంఘం ఆధ్వర్యంలో డా॥ బాబు జగ్జీవన్ రావు జయంతి పురస్కరించుకొని మాదిగ జాగృతి సంఘం భవిష్యత్తు కార్యాచరణ వివరించినారు. అనంతరం క్యాలెండర్స్ ను ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమాల్లో మోర్తాడ్ మండల ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు ఉమేష్ మహారాజ్, ఉపాధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి పాలెపు రాము, మండల నాయకులు నర్సయ్య, కులపెద్ద గంగారం, గ్రామDSP అధ్యక్షులు సాగర్, శ్రీనివాస్, దేవేందర్, అభిలాష్, మహేష్, సతీష్, సాయిలు, నరేష్ నిలేష్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.
