30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాదిగ జేఏసీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నగరంలోని కమాన్ ప్రాంతంలో గల ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ మాట్లాడారు.  డా॥ బాబు జగ్జీవన్ రావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశాడని గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ అధికార ప్రతినిది మల్లాని శివ, పిల్లి విజయ్ కుమార్, అన్న బాహూ సాటే  జిల్లా అధ్యక్షులు గంగాధర్ గైక్వాడ్, శంకర్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article