23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

షార్ట్ సర్క్యూట్‌తో బట్టల షాప్ దగ్ధం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రూ.50 లక్షల ఆస్తి నష్టం

 ఎల్లారెడ్డి, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ కార్యాలయం పక్కన ఉన్న కనెక్ట్ మెన్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు.శనివారం రాత్రి యథావిధిగా షాప్ మూసివేసి వెళ్లిన యజమాని నాగం దేవేందర్, ఆదివారం ఉదయం షాప్ తెరవడానికి వచ్చిన కార్మికుడు లోపల మంటలు వ్యాపిస్తున్నట్లు గమనించి వెంటనే యజమానికి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో షాప్‌లోని వస్త్రాలు, ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఫైర్ అధికారి వినోద్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.షాప్ యజమాని నాగం దేవేందర్ మాట్లాడుతూ… ఇది నా జీవనాధారం. ఒక్కసారిగా ఇలా అన్నీ కాలిపోవడంతో నేను పూర్తిగా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాను” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

lothing shop burnt down due to short circuit

More articles

Latest article