- బెజ్జోరా వాగు నుండి ఆర్మూర్ కు తరలిస్తున్న ఇసుకసురులు
- గోవింద్ పేట్, పెర్కిట్ లో లారీల స్వాధీనం
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని బెజ్జోరా గ్రామ వాగు నుండి ఆర్మూర్ కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను సోమవారం పట్టుకొన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను అధికారులు పట్టుకొన్నారు. ఇసుకను ఆర్మూర్ కు తరలిస్తుండగా గోవింద్ పేట్, పెర్కిట్ గ్రామాల్లో లారీలను పట్టుకొన్నారు. ధారంగుల సాహెబ్ (మెట్ పల్లి)రావు, పల్లెపు రాజన్న(బ్రాహ్మణ పల్లి), దేరంగుల వీరన్న (బ్రాహ్మణ పల్లి), దేవల్ల ఎల్లయ్య (మోర్తాడ్), మామిడి మహిపాల్ (బ్రాహ్మణ పల్లి), ముద్దంగుల రమేష్ (రామచంద్ర పల్లి), దండుగుల దుర్గయ్య (మునిపల్లి)ల లారీలను అధికారులు పట్టుకొని పంచానామా చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
