27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

త్రాగునీటి కోసం గ్రామ పంచాయతీకి తాళం

Must read

📰 Generate e-Paper Clip

. . . పంచాయతీ సేక్రేటరీ నిర్బంధం

. . .  ప్రత్యేక అధికారులు పట్టించుకోక పోవడంతో గ్రామస్థుల నిరసన

రుద్రూర్, బతుకమ్మ:

పాలకులు లేరు .. పేరుకు ప్రత్యేక అధికారులు ఉన్న నీటి గోసను పట్టించుకోవడం లేదు. అధికారులకు విన్నవించిన తమ సమస్యకు పరిష్కరం లభించకపోవడంతో గ్రామస్థులు పంచాయతీ కార్యాలయంకు తాళం వేసి నిరసన తెలిపారు. పంచాయతి సెక్రేటరి కార్యాలయంలో ఉండగానే తాళం వేసి నిర్బంధించి నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా  రుద్రూర్ మండలంలోని రాయకుర్ గ్రామంలో గత వారం రోజుల నుండి త్రాగు నీరు రావడం లేదని, బోరు మోటారు చెడిపోయి మరమత్తుల దశకు చేరిందని, ఈ విషయమై గ్రామపంచాయతీ సెక్రటరీ  శ్రీనివాస్ కు పలుమార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు మంగళవారం నిరసన తెలిపారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ మంగళవారం గ్రామస్తులు గ్రామ పంచాయతీ సెక్రెటరిని నిర్బంధించి, గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వెంటనే త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు.

 

Lock to Gram Panchayat for drinking water

More articles

Latest article