– బినోల విండో చైర్మన్ మగ్గరి
బతుకమ్మ, నవీపేట్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చెయ్యాలని బినోల విండో చైర్మన్ మగ్గరి హన్మాండ్లు డిమాండ్ చేశారు. మండలం లోని బినోల సొసైటీ లో సోమవారం చైర్మన్ మగ్గరి హన్మండ్లు అధ్యక్షతన 62 వ మహజన సభను నిర్వహించారు. ముందుగా కార్యదర్శి రమేష్ సంఘ ఆర్థిక లావాదేవీలు, ఎరువుల క్రయ విక్రయాలను, వార్షిక లావాదేవీలు వివరించారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ కచ్చితంగా అమలుచేయాలనీ,సాంకేతిక మరియు ఇతర కారణలవల్ల రుణమాఫి కాని రైతులకు తదుపరి విడుదల మాఫీ లో రుణమాఫి వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల సన్నాలకు రూ.500/- బోనస్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఖాజా ఆశమెద్దిన్,పాలకవర్గ సభ్యులు విజయ్, ప్రదీప్ రావు, బాలు చందర్, అంజగౌడ్, మనోహర్ రావు, నవీన్ రావు,సంపూర్ణ,సంఘ సీఈవో రమేష్, సిబ్బంది మరియు వివిద గ్రామల రైతులు పాల్గొన్నారు.
