- ఎల్లారెడ్డి ఆర్డిఓకు 5 వ వార్డు ప్రజల వినతి
ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారె డ్డి మున్సిపాలిటీ 5వవార్డు లోని గండిమాసానిపేట్ లో గల మొగుళ్ళ చెరువు ను ఆక్రమణల నుంచి కాపాడాలని స్థానిక కాలనీ వాసులు ఎల్లారెడ్డి అర్డిఓకు లిఖీతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సొమవారం అబ్ధుల్ వాహీద్ అధ్వర్యంలో స్థానిక వార్డుకు చెందిన ప్రజలు విన్నవించుకున్నారు. ఎల్లారెడ్డి బల్ధియాలోని సర్వే నెంబర్ 446లోని 65 ఎకరాల 38 గుంటల భూమి ఉండగా భూ కబ్జా దారులు భూమిని కబ్జా చేస్తున్నారని అన్నారు. చెరువు ను సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎల్లారెడ్డి అర్డిఓకు వినతి పత్రం అందజేశారు. ఆర్డీఓ స్పందించి త్వరలోనే వారిపై చర్యలు తీసుకొని హద్దులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

