29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సంకల్పంతో జీవనాన్ని ముందుకు సాగించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • సంస్కృత కవి మేడిచర్ల ప్రభాకర్ రావు

 

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : మానవళి అందరికి సంకల్పం అనేది ఉండాలని, ప్రతి ఒక్కరు ఆ సంకల్పంతోనే తమ తమ జీవనాన్ని కొనసాగించాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గీతా భవనం సెక్రటరీ, సంస్కృత కవి, కీర్తి పురస్కార గ్రహీత మేడిచర్ల ప్రభాకర్ రావు ఉద్బోదించారు. శనివారం ఆయన జ్యోతి ప్రకాశం చేసి శ్రీసరస్వతి గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రముఖ కవి తొగర్ల సురేష్ రచించిన సంకల్పం యాత్ర చరిత్ర గ్రంథాన్ని ఆయన ఘనంగా ఆవిష్కరించారు. మనిషి తన లక్ష్యసిద్ధికి మనోసంకల్పం అవసరమని అన్నారు. ఈ సందర్బంగా ప్రముఖ ఇంద్రజాలీకుడు రంగనాథ్ తన వ్యాఖ్యనంతో వీక్షకులను మంత్రముగ్దల్ని చేశారు.ఈ కార్యక్రమం లో శబ్ద తరంగిణి సాంస్కృతిక సేవా సంస్థ ప్రెసిడెంట్ డా. షేర్ల దయానంద్ కవి కంకణాల రాజేశ్వర్, అర్ష కవి శ్రీనివాస్ ఆర్యా, వి. పి చందన్ రావు, దారం గంగాధర్,సంకలసహాయాత్రికుడు తిరునగరి నవనీత్, దంతాల రాజేశ్వర్, ఆడెపు లింబాద్రి,చాకు లింగం, గీతా దయానందం, డాక్టర్ పోత్నూర్ లక్ష్మణ్, ప్రముఖ ఇంద్రజాలికుడు వేదాంతము రంగనాథ్, వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి, కండక్టర్ నర్సయ్య, జనగామ చంద్రశేఖర్ శర్మ, డాక్టర్ గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article