- నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సేషన్స్ జడ్జి టి.శ్రీనివాస్ రెండు వేర్వేరు తీర్పులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సేషన్స్ జడ్జి టి. శ్రీనివాస్ నాల్గవ అదనపు జిల్లా సేషన్స్ కోర్టు ఇంచార్జీ జడ్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.మహిళలపై జరిగిన అత్యాచార కేసులను విచారించడానికి వీలుగా స్పెషల్ సేషన్స్ జడ్జ్ ఫర్ ఫాస్ట్ ట్రాకింగ్ ద కేసెస్ రిలేటింగ్ టు అట్రాసిటీస్ ఎగనెస్ట్ ఉమెన్ కోర్టు గతంలో ఏర్పాటు చేశారు. దానిని నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సేషన్స్ కోర్టు కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ కోర్టుకు టి.శ్రీనివాస్ స్పెషల్ సేషన్స్ జడ్జిగా ఉన్నారు.ఒక మహిళ హత్యకేసులో ,మరొక మహిళపై అత్యాచారం కేసు నేర న్యాయవిచారణ నిర్వహించిన ఆయన మంగళవారం సదరు రెండు క్రిమినల్ కేసులలో తీర్పులను వెలువరించారు.రెండు కేసులలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ పోలీసుల తరపున ప్రాసిక్యూషన్ నిర్వహించారు. వివరాలు…ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన జమాల్పూర్ చంద్రకళ,దండుగుల తిర్మల్, దండుగుల సావిత్రి ఇరుగుపొరుగు వారు.చంద్రకళ దత్తత కూతురు కులాంతర వివాహం చేసుకున్నది. చంద్రకళ గంజాయి,సారా అక్రమంగా అమ్మడం మూలంగా ఒకసారి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చింది.రెండు కారణాలకు తిర్మల్,సావిత్రి లు దోహదం చేశారని చంద్రకళ వారితో చీటికీమాటికి గొడవ పడేది.ఈమె మటిమాటికి గొడవ పడుతుందని భావించిన ఇద్దరు 8 మే,2007 న అర్థరాత్రి పన్నెండు గంటలకు తిర్మల్ చంద్రకళ తలపై ,వీపుపై గొడ్డలితో కొట్టి గాయపరచి హత్య చేశాడని,అతనికి అతని భార్య సావిత్రి సహకరించిందనే నేరారోపణలు నాటి ఆర్మూర్ సర్కిల్ పోలీస్ ఇన్స్పెక్టర్ (ప్రస్తుత డిప్యూటీ పోలీస్ కమిషనర్) బస్వారెడ్డి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు.బెయిలుపై విడుదలైన అతను కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో కోర్టు బెయిలుకు వీలులేని అరెస్టు వారంట్ జారీ చేసింది.అప్పటి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అయిన నిజామాబాద్ మూడవ అదనపు సేషన్స్ కోర్టు ముద్దాయి అయిన సావిత్రి పై నేర విచారణ జరిపి హత్య నేరంలో ఆమె ప్రామేయం లేదని ఆమెపై హత్య అభియోగం నుండి నిర్దోషిగా విడుదల చేశారు. తిర్మల్ గత పదహారు సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడు. గత సంవత్సరం,2024 ఫిబ్రవరి 16 న పోలీసులకు పట్టుబడడంతో జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నారు.అతనిపై అభియోగ పత్రం ఆధారంగా ఐదుగురు సాక్షుల సాక్ష్యాలను నమోదు చేసి,తొమ్మిది దృవీకరించుకున్న పత్రాలు,మరో ఎనిమిది వస్తుగత సాక్ష్యాలను పరిగణలోకి తీసుకున్న జడ్జి శ్రీనివాస్ ప్రధాన ముద్దాయి అయిన తిర్మల్ పై హత్య నేరారోపణ రుజువైందని నిర్థారిస్తూ జీవిత కారాగార శిక్ష విధించారు.
మహిళపై అత్యాచారం కేసులో జీవితఖైదు..
*నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలంలోని న్యాల్కల్ గ్రామానికి చెందిన బత్తుల రాము,బొదాసు లక్ష్మన్ లు స్నేహితులు రోజు మద్యం సేవించేవారు. అదే గ్రామ నివాసురాలైన వివాహితతో వారికి దగ్గరి సన్నిహితం ఏర్పడింది. ఆమె ఒకరోజు దవాత్ కావాలని ఇద్దరిని కోరింది. ఆమె మరొక మహిళతో కలిసి ,ఇద్దరు మగవాళ్ళతో సిర్పూర్ గ్రామ శివారులోని సిద్ధులగుట్టకు దూర ప్రాంతంలో 19 జూన్ ,2017 న బీర్లు తాగారు.తిరిగి ఎవరింటికి వారు వచ్చారు, సెల్ ఫోన్ లో సంప్రదించుకుని మళ్లీ రాత్రి తొమ్మిది గంటలకు న్యాలకల్ గ్రామ మాసాని చెరువు కట్ట దగ్గర బీర్లు సేవించారు. మద్యం మత్తులో బత్తుల రాము సదరు మహిళపై అత్యాచారం చేశాడనే నేరారోపణ కోర్టు నేర న్యాయవిచారణలో రుజువు కావడంతో ప్రధాన ముద్దాయి రాముకు జీవిత కారాగార శిక్ష విదిస్తు జడ్జి శ్రీనివాస్ యాభై తొమ్మిది పేజీల తీర్పును వెలువరించారు.రెండవ ముద్దాయి బొదాసు లక్ష్మణ్ కోర్టు విచారణ మధ్యలో మరణించడంతో కేసు క్లోజ్ చేశారు.