ఇందూర్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇండోరు విద్యుత్ ఉప కేంద్రం నెలకొల్పేందుకు హైదరాబాద్ లోగల కేంద్రాన్ని పరిశీలన చేసేందుకు వెళ్లారు. మొట్టమొదటిసారిగా ఇండోర్ విద్యుత్ ఉప్పకేంద్రాన్ని సిఎండి కే. వరుణ్ రెడ్డి మంజూరు చేసారు. ఆ పనులు చేపట్టడానికి హైదరాబాదులో ఉన్న ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రాలను నిజామాబాద్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్వామి, కన్స్ట్రక్షన్ ఏడి రాజశేఖర్, కన్స్ట్రక్షన్ ఏఈ వినోద్, గుత్తేదారుడు వెళ్లి పరిశీలించారు. దీనిలో పవర్ ట్రాన్స్ఫార్మర్ మాత్రమే బయటికి కనిపిస్తుందని 33 కెవి, లెవెన్ సర్క్యూట్ బ్రేకర్స్ అన్ని కేబుల్స్ తో ఇండోర్లోని ఉంటాయని ఈఈ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో నిర్వహించబోతున్న ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రాన్ని నిజామాబాద్ నగరంలోని పులాంగ్ లోగల రైతు బజార్ లో ఏర్పాటు కాబోతుందని తెలిపారు.
