- గ్రంథాలయ జిల్లా చైర్మన్ ఏ. రాజారెడ్డి
భీమ్‌గల్, బతుకమ్మ: భీమ్ గల్ పట్టణంలో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభింపజేసి అందుబాటులోకి తెస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంత రెడ్డి రాజారెడ్డి అన్నారు.గురువారం పట్టణ కేంద్రంలో లో రూ.28 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన శాఖా గ్రంథాలయ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ భవనం లోని వివిధ విభాగాల గదులను పరిశీలించి, భవనం గ్రంథాలయ నిర్వహణకు అనుకూలంగా నిర్మించినందుకు సంతృప్తిని వ్యక్తం చేశారు.శాఖ గ్రంథాలయాన్ని తనిఖీ చేసి లైబ్రరీకి వచ్చే పాఠకుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠకుల అవసరమైన బుక్స్ కావాలంటే నా దృష్టికి తీసుకురావాలని జిల్లా తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీ.స్వామి పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, మాజీ వార్డ్ మెంబర్ తోట సతీష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
