హెచ్ఐవీ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
దోమకొండ, బతుకమ్మ : ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకుని హెచ్ఐవీ రహిత సమాజాన్ని నిర్మించాలని దోమకొండ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా దోమకొండలో శనివారం వై.ఆర్.జీ కేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో హెచ్ఐవీ, ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.... హెచ్ఐవీ నిర్మూలనలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యులు కావాలని కోరారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఐసిటీసీ కౌన్సిలర్ మేక నాగరాజు మాట్లాడుతూ.. ఐసీటీసీ, ఏఆర్టీ సేవల గురించి వివరించారు. హెచ్ ఐవీ...