25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రాజకీయాలు వదలండి.. గర్ల్స్ హాస్టల్ నిర్మించండి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎబివిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోహన్

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో గర్ల్ హాస్టల్ ముందు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం  నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎబివిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోహన్ మాట్లాడుతూ తెలంగాణ పేరున ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీ లో అడుగు అడుగున సమస్యలె దర్శనమిస్తున్నాయనీ రుస ఫండ్స్ కింద గర్ల్ హాస్టల్ కు డబ్బులు మంజూరు అయినప్పటికీ వీసీ అలసత్వం,స్థానిక ఎమ్మెల్యే రాజకీయం కారణంగా ఇప్పటికీ గర్ల్స్ హాస్టల్ కట్టకపోవడం  సిగ్గుమాలిన చర్యని అన్నారు. ఇటీవల యూనివర్సిటీ కి ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం హర్షించ దగ్గ విషయం అని అన్నారు. కానీ ఇప్పుడు నూతనంగా వచ్చే బాలికలకు ఏ విధంగా వసతి కల్పిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. యూనివర్సిటీ ఎబివిపి యూనివర్సిటీ నాయకురాలు  భవానీ  మాట్లాడుతూ ఇంత పెద్ద యూనివర్సిటీ లో కేవలం బాలికలకు ఒకటే వసతి గృహం ఉండడం సిగ్గు చేటు అని, ఇప్పటికె ఒక్కోక గదిలో 8 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని,తక్షణం బాలికల వసతి గృహం ఏర్పాటు చేయాలని వారు అన్నారు. సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఎబివిపి తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని, అవసరమైతే నిరవదిక ధర్నాకు పిలిపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షులు పృథ్వీ, కార్యదర్శి సమీర్, ఉపాధ్యక్షులు మనోజ్,అజయ్, సంయుక్త కార్యదర్శులు అనిల్, అఖిల్, లెనిన్ నాయకులు, సాయి, సరిత, రాహుల్ , కుపేందర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article