బీఆర్ఎస్ లో చేరిన వాడి గ్రామ కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు

0 1,069

బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : నాగిరెడ్డిపేట మండలంలోని వాడి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి పార్టీ ల నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్, బిజెపి పార్టీలను వీడి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి జాజాల సురేందర్ బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం జాజాల సురేందర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రజలు నమ్మక కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీతో పాటు నేను మీకు అన్ని విధాల అండగా ఉంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలను నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో పచ్చంటి చందర్, గడ్డం అశోక్, గడ్డం కిష్టయ్య, కోడె సాయిలు, కోడే చిన్న సాయిలు, బాలింగం గోపాల్, రాఘవులు, పుట్టి రవి, డాకే దత్తు, దాకే నాందేవ్, గడ్డం నరసింహులు, అంతన్నగారి నర్సింలు, మన్నే సిద్ధూ, పుట్టి నర్సింలు సుమారు 50 మంది చేరినట్లు మండల బిఆర్ఎస్ పార్టీ గుర్రాల సిద్దయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.