27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామనడం సంతోషకరం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శాసన మండలిలో తెలంగాణ ప్రభుత్వం అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం సంతోషకరం అని తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షులు చిట్టి బాబు అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలో పాత కలెక్టరేట్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి పీసీసీ రాష్ట్ర అద్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెలక్క లకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి ఆండ్రాసి చిట్టిబాబు, నల్ల మహేందర్, మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కష్టపడి పని చేసి నప్పటికి అర్హులైన కళాకారులకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని, అర్హులను విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కళాకారులను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఆలోచించడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శాసనమండలిలో తెలంగాణ ఉద్యమంలో కష్టపడి పని చేసిన అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మాట్లాడడం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, సాంస్కృతిక సారధి చైర్పర్సన్ విమలక్కలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రెటరీ దేగావత్ గణేష్, ఉపాధ్యక్షులు సభావాత్ గోపాల్, మాడబోయి ఆంజనేయులు, ఎర్రోళ్ల స్రవంతి, సహాయ కార్యదర్శులు కేతావత్ అశోక్, బ్యాకరి శ్రీధర్, సలహాదారులుగా పొగరి సంజీవ్,
సభ్యులుగా డప్పు సంతోష్, అమద్ హుస్సేన్, యోగేష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article