నందిపేట్, బతుకమ్మ : దత్తపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యలపై దత్తాపూర్ గ్రామానికి చెందిన పంచాయతీ రాజ్ డి ఈ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ డి ఈ రవికుమార్ కలసి వినతి పత్రం అందజేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ కమిటీ సభ్యులు అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తిచేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. కమిటీ సభ్యులు చేసిన విన్నపం మేరకు వెంటనే స్పందించిన డి ఈ రవికుమార్ కాంట్రాక్టర్ ను వెంటనే పిలిపించి సమస్యను వెంటనే పరిష్కరించాలని పనులు వారంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూమేష్ రెడ్డి, లిఫ్ట్ ఇరిగేషన్ ఫోరం ఉమ్మడి మండల అధ్యక్షుడు భోజ రెడ్డి, దత్తాపూర్ లిఫ్ట్ చైర్మన్ వెంకటరమణ, వైస్ చైర్మన్ రవీందర్, నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.