మాతా శిశు మరణాలను అరికట్టాలి

0 1,145

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : మాతా శిశు మరణాలను అరికట్టాలని, క్షేత్ర సిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు జరిగిన మాతా శిశు మరణాలు నివారించగలిగినవి ఉన్నప్పటికినీ క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన రాహిత్యం వలన సంభవించాయనీ తెలిపారు. ఇకముందు జరిగే మాతా శిశు మరణాలకు సంబంధించిన నివేదికలను ఏ రోజు కారోజు జిల్లా కలెక్టర్ కు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఫీల్డ్ లో ఉండాలని అన్నారు. మాతా శిశు మరణాలు సంభవించకుండా సూపర్వైజర్లు, ఆశ, ఏఎన్ఎం లు, మల్టీ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్ర శేఖర్, డి.సి.హెచ్.ఎస్. డా. విజయ లక్ష్మి, మెడికల్ కాలేజి సూపరింటెండెంట్ డా. ఫరీదా, పి..ఓ.,ఏం.హెచ్.ఎన్. డా. శ్రీఖర్, డిప్యూటీ డేమో ఆర్.వేణుగోపాల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Maternal and child deaths should be prevented

Leave A Reply

Your email address will not be published.