- ఎమ్మెల్యే మదన్ మోహన్
సదాశివ నగర్, బతుకమ్మ : కంపెనీ లు రావడం వల్ల మన నియోజకవర్గంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామం లో ఆయన రూ.2.40 కోట్ల నిధులతో మిషన్ భగీరథ బల్క్ నీటి కనెక్షన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ సకల సదుపాయాలతో టీజీఐఐసీని ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ఒక కంపెనీ ని తీసుకొచ్చానన్నారు. అది కూడా వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది అని అన్నారు. మరిన్ని కంపెనీ లతో కూడా మాట్లాడుతున్నానని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఎన్నో సార్లు జాబ్ మేళాలు పెట్టి యువతకు ఉపాధి కల్పించానని గుర్తు చేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు 23 కోట్ల నిధులను విడుదల చేసాం అని అన్నారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ నిర్మాణ పనుల్లో భాగంగా భూంపల్లి, మోతే, కాటేవాడి జలశాల నిర్మాణాలకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ తో మాట్లాడి అవసరమైన పెండింగ్ లో ఉన్న క్లీరెన్స్ చేపించాం అని అన్నారు. ఆర్ధిక శాఖ నుండి ఫైనల్ అప్రూవల్ వస్తే జలాశయాల నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయి అని రైతులకు తెలిపారు. భూములు కొల్పోయిన రైతులకు నష్టపరిహారం అందే విధంగా ప్రభత్వానితో మాట్లాడుతాను అని అన్నారు. రైతుల వివరాలు రిపోర్ట్ తయారు చేసి ఒక వారం రోజులో అందించాలని ఎమ్మార్వోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సదాశివనగర్ మండల అధ్యక్షులు, మండల ఎమ్మార్వో, మిషన్ భగీరథ అధికారులు, మండల సీనియర్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ కమిటి సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

