29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

నందిపేట్ లో భూ వివాదం

Must read

📰 Generate e-Paper Clip

  • వీడీసీ వర్సెస్ ఒక కుటుంబం 
  • భూమిని  చదును చేయకుండా అడ్డుకున్న వీడీసీ 
  • కోర్టు ఉత్తర్వులను బేఖతారు చేస్తూ అజామాయిషి 

బతుకమ్మ,నందిపేట్ : నిజామాబాద్ జిల్లాలో వీడీసీల ఆగడాలు మితిమిరిపోతున్నాయి. మొన్నటి వరకు పోలీసు కమిషనర్ గా పని  చేసిన కల్మేశ్వర్ హయంలో వీడీసీలపై ఉక్కుపాదం మోపారు. వీడీసీ కార్యవర్గాలను మూకుమ్ముడిగా జైలు ఊచలను లెక్కపెట్టించిన ఘనతను కల్మేశ్వర్ దక్కించుకున్నారు. దానితో వీడీసీని గ్రామాలలో సమాంతర పాలనకు వెనుకడుగు వేశాయి. కానీ కమిషనర్ బదిలీ కాగానే మళ్ళీ వీడీసీల ఆగడాలు పెరిగిపోయాయి. తాజాగా మంగళవారం  నందిపేట్ మండల  కేంద్రంలో ఓ కుటుంబానికి సంబంధించిన భూ వివాదంలో గ్రామాభివ`ద్ది కమిటీ జోక్యం  చేసుకోవడం కలకలం రేపింది. మండల  కేంద్రానికి చెందిన రేష్మా బేగం, సాజిద్ దంపతులకు వారసత్వంగా సర్వేనంబర్ 925లో ఎకరం 25 గుంటల భూమి హక్కుగా లభించింది. దానిపై ఉన్న వివాదాలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా రేష్మా బేగం, సాజిద్ దంపతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశానుసారం నందిపేట్ మండల కేంద్రంలో సంబంధిత భూమిని యంత్రాలతో చదును చేస్తుండగా వీడీసీ అడ్డుకుంది. దానితో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితులను చక్కదిద్దే  ప్రయత్నం చేశారు. తమ భూమి తన భార్య తండ్రి ఇస్మాయిల్ నుంచి రేష్మా బేగంకు వారసత్వంగా వచ్చిందని, తమ భూమికి కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో భూమి చదును చేసే పనులు మొదలుపెట్టామన్నారు. కానీ విడిసి సభ్యులు పనులు ఆపాలని బెదిరించడం చట్టవిరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు.మాకు ప్రభుత్వానికి మధ్య వ్యాజ్యంలో విడిసి సభ్యుల జోక్యం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూమి కబ్జా చేయడం లేదని, మా భూమిలో మేము రావద్దని వారు ఎలా ఆదేశిస్తారని ” అని దంపతులు మండిపడ్డారు.

Land dispute in Nandipet

More articles

Latest article