26.3 C
Hyderabad
Monday, August 3, 2026

రెండు లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన లక్ష సత్యానారయణ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్ సీఐ

. . . ఎసిబి పట్టుకోవడంతో అస్వస్థత డ్రామా

. . . వైద్యుడిని రప్పించి బందోబస్తు మధ్య సీఐ ఇంట్లో సోదాలు

బిచ్కుంద, బతుకమ్మ :

ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయం వచ్చే నెంబర్ వన్ డిపార్ట్మెంట్. ప్రభుత్వానికి ఆదాయం తో పాటు అందులో పనిచేసే అధికారులకు నెలా మామూళ్లు లక్ష ల్లో ఉంటాయి. ఇలాంటి ఆబ్కారీ శాఖలో లక్ష సత్యనారాయణ గా పేరు గడించారు కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ సీఐ. ఆయన ప్రతి పనికి రూ. లక్ష కు తక్కువ  కాకుండా మామూళ్లు (లంచం) తీసుకోకుండా ఏ పని చేయరని ప్రసిద్ధి. అందుకే ఆయన ఇంటి పేరు దీను సత్యనారాయణ అంటే ఎవరు గుర్తించరు. లక్ష సత్యనారాయణ అంటే టక్కున బిచ్కుంద ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ( ఎస్ హెచ్ ఓ)  అని చెప్పేస్తారు. దాదాపు మూడు సంవత్సరాలుగా బిచ్కుంద ( జుక్కల్ నియోజకవర్గం)ను అప్రహతిహతంగా ఎలుతున్న సీఐ లక్ష సత్యనారాయణ శుక్రవారం ఉదయం తన నివాసం( అద్దె ఇంటి) లో గీత కార్మీకుడి నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుబడ్డారు…

Lakh Satyanarayana caught taking a bribe of two lakhs

కామారెడ్డి జిల్లా, బిచ్కుంద ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్‌ స్పెక్టర్ లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ వలలో చిక్కుకున్నారు.  నిజామాబాద్ రెంజ్ ఎసిబి డిఎస్పీ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం…. బిచ్కుంద ప్రొహిబిషన్  అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దీను సత్యనారాయణ కల్లు దుకాణం ( డిపో)  నిర్వహణను వేరే గ్రామం మార్పిడి కోసం వచ్చిన ఫిర్యాదు దారుని రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆ నగదు లంచం ఇస్తే తన కల్లు దుకాణం జోలికి ఎవరూ రాకుండా చూసుకుంటానని, సంబంధిత కల్లు దుకాణం పై ( కల్తి కల్లు విక్రయాలకు,  నిషేధిత మత్తు పదార్థాలు కలిపి తయారు చేసిన) ఎటువంటి కేసులు నమోదు కాకుండా తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో  గీత కార్మీకుడు( లైసెన్స్ కలిగిన) ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఏసీబీ అధికారులు బిచ్కుంద ఎక్సైజ్ సీఐ తన ఇంటిలో గీత కార్మీకుడి నుంచి లంచం తీసుకుంటుండగా రైడ్ నిర్వహించగా రూ.2 లక్షల నగధుతో రెడ్ హ్యాండేడ్ గా పట్టుబడ్డారు. ఆకస్మాత్తుగా ఎసిబి అధికారులు రైడ్ చేయడంతో  ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ అస్వస్థతకు గురైనట్టు డ్రామాకు తెరలేపాడు. వెంటనే ఎసిబి అధికారులు ప్రభుత్వ వైద్యుడిని రప్పించి పరీక్షలు నిర్వహించగా అవి ఉత్తదే అని తేలింది. పోలిస్ బందోబస్ధు మద్య సిఐ నివాసంలో సోదాలు నిర్వహించగా లెక్కలు చూపని రూ.45,760 లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. తన ప్రభుత్వ విధులు నిజాయితీ లేకుండా, అనుచితంగా నిర్వర్తించినందుకు  ఎక్సైజ్ సీఐ దిను సత్య నారాయణ ను అరెస్ట్  చేసి హైదరాబాద్ లో నాంపల్లి కోర్టులో రెండో అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.

Lakh Satyanarayana caught taking a bribe of two lakhs

 

More articles

Latest article