26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలో కుర్ర మోహన్‌కు డాక్టరేట్

Must read

📰 Generate e-Paper Clip

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలో కుర్ర మోహన్ కి డాక్టరేట్ పట్టా అందజేశారు. ఆయన “ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రియల్ వ్యర్థాల నిర్మూలన, ఆర్గానిక్ సింథసిస్ కోసం సమర్థవంతమైన రంధ్రాలు గల ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడ్ ఆధారిత కాటలిటిక్ వ్యవస్థల తార్కిక రూపకల్పన” అనే అంశంపై పరిశోధన చేసి ఈ పట్టాను పొందారు. ఈ పరిశోధనకు డా. శిరీషా బోయపాటి మార్గదర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్. జ్యోతి బాహ్య పరిశీలకురాలిగా హాజరై, ఈ పరిశోధన పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కె. సంపత్ కుమార్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగానికి చెందిన అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article