పీఆర్ టీయూ మోపాల్ మండల అధ్యక్షుడిగా కొట్టూరు దేవిదాస్
మోపాల్, బతుకమ్మ : పీఆర్ టీయూ మోపాల్ మండల అధ్యక్షుడిగా రెండవసారి కొట్టూరు దేవిదాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పీఆర్ టీయూ మండల పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. అధ్యక్షులుగా కొట్టుర్ దేవదాస్, ప్రధాన కార్యదర్శి గా ఎం.రాజశేఖర్, అసోసియేట్ అధ్యక్షులుగా గోవింద్, ఉపాధ్యక్షులుగా రమేష్ కుమార్, చంద్రు, మహిళ అసోసియేట్ అధ్యక్షురాలుగా ఘంటా మాధవి, ఉపాధ్యక్షులుగా విజయలక్ష్మి, నీరజ, కార్యదర్శులుగా సుధాకర్, నరేష్, మహిళా కార్యదర్శిలుగా దీపారెడ్డి, సువర్ణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....