28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎసిబి వలలో కోత్తగూడేం అటవి అధికారులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  సబ్ డివిజన్ ప్లాంటేషన్ మేనేజర్  అరెస్ట్

. . . రూ.3.51 లక్షల ప్రైవేటు వ్యక్తి ద్వారా తీసుకుంటుండగా పట్టివేత

. . . పరారీలో లంచం డిమాండ్ చేసిన కోత్తగూడేం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్

 భద్రాద్రి కొత్తగూడెం, బతుకమ్మ :

ఆటవి శాఖాధికారులు లంచాలకు అలవాటు పడి వాటాలు వేసుకుని మరి వసూళ్లకు బరితెగించారు. ఒక్కటే రోజు భద్రాద్రి జిల్లాలో ఆటవి శాఖ ఏసీబీ మెరుపు దాడులు సంచలనం రేపారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కొత్తగూడెం అటవీ సబ్-డివిజన్ ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్, ప్రైవేటు వ్యక్తి చెన్నం గోపాల కృష్ణ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి సుమారు 3,900 టన్నుల నీలగిరి చెట్లు నరికి వేయడానికి కావాల్సిన బిల్లుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికోసం కొత్తగూడెం ఫారెస్ట్​ డివిజన్​ మేనేజర్​ తాటి శ్రావణి రూ. 3.51 లక్షల లంచం డిమాండ్​ చేశారు.దీంతో బాధితుడు ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు. ఫిర్యాదుదారుడు నుంచి  రూ.3.51 లక్షలను ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్, ప్రైవేటు వ్యక్తి గోపాల కృష్ణ సూచనల మేరకు జోగు చెన్నారావు అనే వ్యక్తి లంచం మొత్తం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఈ కేసులో ఆటవి శాఖ ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్, గోపాల కృష్ణ ని అరెస్ట్ చేశారు. ప్రధానంగా లంచం డిమాండ్ చేసిన  కోత్తగూడేం ఎఫ్ డి ఓ తాటి శ్రావణి పరారీలో ఉన్నారు. ఆమె కోసం అధికారులు గాలిస్తున్నారు.

 

More articles

Latest article