. . . డి 54 కెనాల్ లో రెవెన్యూ అధికారుల పట్టాల జారీ?
. . . ఫోర్జరీ పట్టాల సూత్రదారి ఆధ్వర్యంలో లక్షల విలువైన స్థలం కబ్జాకు యత్నం
. . . బోందం చెరువులో డూప్లికేట్ పట్టాల తయారీదారు ఆధ్వర్యంలో కబ్జా దందా
. . . ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
. . . పోలీసులు ఫోర్జరీ పట్టాల తయారిధారులా భరతం పడుతారా?
నిజామాబాద్ , బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మళ్లీ పేక్ పట్టాలు( ఫోర్జరీ సంతకాలతో) దస్తావేజులు వెలుగులోకి వచ్చాయి. నిజామాబాద్ నగరంలోని డి-53 కెనాల్ లో రెవెన్యూ అధికారులు గతంలో జారీ చేసిన పట్టాల పేరిట కొందరు ఫోర్జరీ సంతకాల ద్వారా తయారు చేసిన పట్టాలతో విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నించడంతో ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. నెహ్రూ నగర్ కు చెందిన ఒక ప్రజాప్రతినిధికి అర్సపల్లి శివారులోని డి-53 కెనాల్ ప్రాంతంలో 150 గజాల భూమి పత్రాలు ఉన్నాయి. గత వారం అక్కడ ముగ్గురు మహిళలు తమకు వారసత్వంగా వచ్చిన రెవెన్యూ ద్వారా జారీ అయిన పట్టాలు ఉన్నాయని కబ్జాకు యత్నించడం తో ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. నిజాం సాగర్ కాలువ నుంచి పులాంగ్ కు డిస్ట్రిబ్యూషన్ కాలువ గా 53 కాలువ ఉంది. అది ప్రస్తుతం కబ్జాకు గురైంది. కాలువ మొదలుకొని అంతం వరకు ఆక్రమణలకు గురైంది. సాధరణంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన చెరువులు, కుంటలకు, వాగులకు, కాలువలకు రెవెన్యూ శాఖ పట్టాలు జారీ చేయడం నిషేధం. కాని ఘనత వహించిన కొందరు రెవెన్యూ అధికారుల చల్లని చూపులతో పట్టాలు పుట్టుకొచ్చాయి. ఎలాంటి రికార్డులు లేకుండా పట్టాలపై ఫోర్జరీ సంతకాలతో సర్కారు, అసైండ్, కాలువలు, కుంటలను చెరబట్టారు అక్రమార్కులు…

నిజామాబాద్ డి 53 కాలువ కు గతంలో అధికారులు జారీ చేసిన పట్టాలు వందకు వందశాతం పోర్జరీవి. అందుకు కారణం లేకపోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అప్పట్లో ఎమ్మార్వో గా పనిచేసిన తర్వాత కాలంలో సబ్ కలెక్టర్ గా పదవీ విరమణ చేసిన అధికారి సంతకంతో వేలాది పట్టాలు పుట్టుకొచ్చాయి. అది సక్రమమో… లేక నకిలివే తేల్చకుండా అనాడు కబ్జా సురులు ఎకంగా నిజామాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ కు నిప్పు పెట్టి రికార్డులు బుగ్గి చేశారు. దాని తరువాత అనాటి నిజామాబాద్ మండలంలో రికార్డులు లేవని సమాధానం షరా మామూలు గా మారింది. దానిని పావుగా వాడుకుని కొందరు మళ్లి పేక్ పట్టాలతో ప్రభుత్వ, ప్రైవేటు భూములు చెరబట్టుతున్నారు. ఇటివల డి-53 కాలువపై రెవిన్యూ అధికారులు ఇచ్చిన పట్టాలు పరిశీలిస్తే అది ఫోర్జరీ అని తెలింది, 2004 కాలంలొ అప్పటి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసిన పట్టాలతో కబ్జాకు తెరలేపారు. అనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మార్వో ల వ్యవస్థ ఉంది. కానీ కబ్జాదారులు తహసీల్దార్ పేరిట సీల్ తయారు చేసి, ఆయన సంతకం పోర్జరితో పట్టాలు తయారు చేశారు. ప్రభుత్వం పేదలకు( బిపిఎల్ ) కింద జారీ పట్టాలను ఎనాడు 60 గజాలు మించి ఇవ్వలేదు. దానికి విరుద్ధంగా 90 గజాలకు ఒక ప్లాట్ చొప్పున పట్టాలు జారీ అయ్యాయి. అంతే కాకుండా పొజిషన్ సర్టిఫికెట్ లో మండల రెవెన్యూ ఆఫీసర్ అని ఉన్న చోట తాహసీల్ధార్ సీల్ వేసి సంతకాలు చేయడం విశేషం. ఇంకా ఎంతగా కబ్జాదారులు తెగించారు అంటే సంబంధిత భూమిని కబ్జా కోసం ఏకంగా సెల్ఫ్ అసెస్మెంట్ ( ఇంటి పన్ను) మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించినట్లు రసీదులు ప్రధర్శిస్తుండగా అవి వెంగల్ రావు నగర్ కాలనీ కి సంబంధించినవి ఉండటం గమనార్హం. సంబంధిత ఫోర్జరీ పత్రాలు భర్త కు ఒక ప్లాట్, భార్యకు ఒక ఫ్లాట్ గా తయారు చేయడం విశేషం. అంతే కాకుండా అందులో ఉన్న వ్యక్తి ఇద్దరు భార్యలు కాదని, మూడో భార్యకు సంబంధించిన (సంతానం) ముగ్గురు కూతుళ్లు తామే అసలైన భూ యజమాని వారసులం అని కబ్జాకు యత్నించడం కోసమెరుపు. మొత్తం ఫోర్జరీ డాక్యుమెంట్లతో నిజామాబాద్ ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి…

నిజామాబాద్ నగరంలోని డి-53 కాలువ భూముల కబ్జాకు యత్నం వెనుక ప్రధాన సూత్రధారి పై 2024 లో 5 వ టౌన్ పోలీస్ స్టేషన్ 166 నెంబర్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. నాగారం బోందం చెరువు శిఖం భూమిలో 73 మందికి ఫోర్జరీ పట్టాలతో అమ్మకాలు చేసిన వారిపై అనాడు పోలీస్ శాఖ 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ లో హైడ్ర తరహలో బోందం చెరువులు ఆక్రమణలు పోలిస్ బందోబస్థుమద్య 2024 ఆగస్టు మాసం చివరి వారంలో కూల్చివేశారు బల్దియా అధికారులు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సంచలనం రేపిన ఘటన లో స్థానిక నాటి 10 వ డివిజన్ కార్పొరేటర్ కోమలి భర్త నరేష్ తో పాటు జావీద్, మహమ్మద్, మస్తాన్, ఉభేద్, అంజద్, సాబేర్ లతో పాటు అప్పటి మేయర్ భర్త అనుచరుడు గోపాల్ తో పాటు స్థానికంగా ప్లాట్లను పెదలకు విక్రయించిన ముగ్గురు మహిళల పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. అనాడు అ కేసులో ఫోర్జరీ పట్టాల తయారిలో సూత్రదారి కోర్టు వద్ద టైపిస్ట్ గా పనిచేసే వ్యక్తి మళ్ళి డి-53 కెనాల్ ప్రాంతంలో పట్టాలు తయారు చేసి కబ్జాలకు తెరలేపి నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఎలా స్పందిస్తారు.. ఫోర్జరీ పట్టాదారుల భరతం పడతారో లేదో చూడాలి.. పోలీస్ శాఖలో సివిల్ పంచాయతీలకు ఇచ్చిన ప్రాధాన్యత పోర్జరి డాక్యూమెంట్స్ , కబ్జాలపై నజర్ వేయడం లేదనే విమర్శలు ఉన్నాయి..

