ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మండలం మగ్గిడి సర్పంచ్ జి. చంద్రకాంత్ గౌడ్ ను శనివారం గ్రామంలో రైతు నాయకుడు కోటపాటి నరసింహం నాయుడు పరామర్శించారు. చంద్రకాంత్ గౌడ్ తండ్రి చిన్న గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. కోటపాటితో కలిసి స్వదేశీ జాగరణ మంచ్ లో అనేక సంవత్సరాలు రైతు మరియు గల్ఫ్ కార్మికుల ఉద్యమంలో కలిసి పనిచేసిన చంద్రకాంత్ గౌడ్ దుబాయ్ నుంచి వచ్చి సర్పంచుగా పోటీ చేసి గెలిచాడన్నారు. ఈశుభ సమయంలో చంద్రకాంత్ తండ్రిని కోల్పోవడం బాధాకరమని కోటపాటి పేర్కొన్నారు. చంద్రకాంత్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపం తెలిపారు. కోటపాటితో పాటు ఎస్. రుక్మాజీ, సునీల్ రావు కులకర్ణి, నరేష్ వర్మ, ఖానాపూర్ సర్పంచ్ నర్సింలు, అందాపూర్ సర్పంచ్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
