కర్ణాటక రైతు నాయకుడిని పరామర్శించిన కోటపాటి

0 2,266

నిజామాబాద్, బతుకమ్మ: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కర్ణాటక రైతు రాజ్య అధ్యక్షుడు, సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ రైతు నాయకుడు కురుబురు  శాంత కుమార్ ను దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై  ప్రాణాలతో బయటపడిన శాంతా కుమారును కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎయిర్ అంబులెన్స్ పంపి చండీఘడ్ నుంచి రప్పించి బెంగళూరులో ప్రభుత్వ ఖర్చులతో ఆపరేషన్ చేయించారని కోటపాటి తెలిపారు. తనతో పాటు దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో శాంతికుమార్ పాల్గొన్నారని, మొత్తం ఆరు దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘాలను ఏకం చేసి తనను అధ్యక్షుడిగా చేశారని అన్నారు. కర్ణాటక రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న శాంతా కుమార్ త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని కోటపాటి ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.