మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద బుధవారం కొమరం భీమ్ జయంతి వేడుకలను అంబేద్కర్ యునజన సంఘం,దళిత సంక్షేమ సంఘం, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహా వీరుడు కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మండల దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లూరు రాజారం, అంగుళీ మల మాట్లాడుతూ గిరిజన సమాజ హక్కుల కోసం పోరాడిన కొమరం భీమ్ మనందరికీ స్ఫూర్తి ప్రదాత. ఆయన నినాదమైన ‘జల్, జంగల్, జమీన్’ ఈ రోజుకీ ప్రాముఖ్యత కోల్పోలేదు. సమాజంలో సమానత్వం నెలకొనే వరకు ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలి అన్నారు. ముగింపులో కొమరం భీమ్ సేవలను స్మరించుకుంటూ నినాదాలు గళం విప్పాయి. నాయకులు ప్రజలు ఐక్యంగా ఉండి సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం నాయకులు కాన్షిరామ్ మాల(గంగాధర్) టి. ధషారాత్ మోర్తాడ్, ఆల్ ఇండియా అంబేద్కర్ నాయకులు మామిడి రాజు, స్థానిక, యువత తరుణ్,సాయ్ కృుష్ణ, అకాష్, సాయ్ లు పదివార్ ముదిరాజ్, మాణిక్ రావు మదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
