ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార వెంగల్పాడు తండాలో బుధవారం నిజామాబాదు రూరల్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ అధికారులకు, రైతులకు పలు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చిన వారి ధాన్యాన్ని వెనువెంటనే తూకం చేయాలన్నారు,వరి ధాన్యం గ్రేడ్ ఏ కు 2389 రూపాయలు,,కామన్ వరి ధాన్యానికి 2369, రూపాయలు,ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులకు తెలిపారు,రైతులు దళారులను నమ్ముకొని ధాన్యాన్ని అమ్ముకుంటే హరిగోసలు పడాల్సి వస్తుందని సూచించారు,కొనుగోలు కేంద్రానికి వచ్చిన వరి ధాన్యాన్ని వెను వెంటనే మ్యాచర్ ద్వారా చూసి తొందరగా మార్కెట్ యార్డుకు లారీలలో తరలించేటట్లు చూడాలని తెలిపారు.లారీల కొరత ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు, వరి ధాన్యాన్ని తరలించే క్రమంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా బాధ్యత వహించాలని తెలిపారు,హన్సన్ పల్లి,లోలం,ఎల్లారెడ్డిపల్లి, గ్రామాలలో తాసిల్దార్ వెంకట్రావు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరు నవీన్ గౌడ్,ఎంపీడీవో అనంతరావు,తహసిల్దార్ వెంకటరావు, ఐకెపి ఏపిఎం శ్యామల,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి,సంతోష్ రెడ్డి, కోరట్పల్లి ఆనంద్, దశరథ్, తదితరులు పాల్గొన్నారు.

