27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మొక్కజొన్న కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను రైతులు తప్పనిసరిగా పొందాలని, ఇందుకోసం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోర్తాడ్ వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ అన్నారు. రైతులు మధ్యవర్తులను, దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి పూర్తిస్థాయిలో లబ్ధి పొందాలని ఆయన పేర్కొన్నారు   ప్రభుత్వం నిర్ణయించిన రూ. 2400 మద్దతు ధర తమకు లభిస్తుందని రైతులకు తెలియజేశారు. ఈ కేంద్రం ద్వారా రైతులు తమ పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా విక్రయించుకోవచ్చని, తద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతారని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు. ఈ కొనుగోలు కేంద్రం శేట్ పల్లీ సహకార సంఘం ప్రాంత రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరను అందించడంలో కీలకపాత్ర పోషించనున్నాయి. కార్యక్రమంలో సహకార సంఘం కార్యదర్శి రఘు, డైరెక్టర్ లక్మ రంజిత్, మండలం యువజన అధ్యక్షుడు మనోజ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆనంద్, బిల్లాల శ్రీనివాస్, మిట్టపల్లి దేవేందర్, శ్యామ్ గౌడ్, రాజు, నారాయణ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

The corn center should be utilized.

More articles

Latest article