26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కేజీబీవీలో మిగులు బడ్జెట్ కిరికిరి

Must read

📰 Generate e-Paper Clip

  • కేజీబీవీలకు టీఎల్ఎం కోసం రూ.33 లక్షలు మంజూరు
  • సప్లై చేయకముందే ఏజెన్సీకి డబ్బులు ట్రాన్స్ ఫర్
  • తాజాగా సర్వశిక్షా అభియాన్ ద్వారా సరఫరాకు నిర్ణయం
  • డబ్బులు తిరిగి ఇవ్వాలంటున్న స్పెషల్ ఆఫీసర్లు
  • అధికారుల అనాలోచిత నిర్ణయంతో ఎస్ వోలకు సంకటం

 

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న స్పెషల్ ఆఫీసర్లకు అధికారుల తీరు సంకటంగా మారింది. నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో కేజీబీవీలకు సంబంధించిన మిగులు బడ్జెట్ నిధులపై కలత చెందుతున్నారు. ప్రభుత్వం 2025-26 విద్య సంవత్సరం నుంచి సర్వశిక్ష అభియాన్ ద్వారానే టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ పంపిణీ చేస్తామని ప్రకటించడంతో ఎస్ వోలు ఆందోళన చెందుతున్నారు. 2024-25 విద్య సంవత్సరం ముగింపు సమయంలో నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారులు కేజీబీవీలకు టీఎల్ఎం బుక్ ల కొరకు ప్రయత్నాలు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ముందు జిల్లాలోని 27 కేజీబీవీలలో టీఎల్ఎంల కోసం 33 లక్షలు సాంక్షన్ కాగా వాటి ద్వారా ప్రైవేట్ ఏజెన్సీ నుంచి కొనుగోలుకు విద్యాశాఖాధికారులు ప్రోసిడింగ్ ఇచ్చారు. అందులో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అనుమతులు వచ్చినా, ఫైనాన్స్ విభాగం నుంచి మాత్రం అనుమతులు రాలేదు. అయితే ప్రతియేటా విద్యా సంవత్సరం ముగింపు సమయంలో మిగులు బడ్జెట్ సద్వినియోగం చేద్దామనుకున్నారో లేదో తెలియదుకానీ విద్యా సంవత్సరం ప్రారంభానికి మూడు నెలల ముందే ప్రైవేట్  ఏజెన్సీకి కేజీబీవీల మిగులు బడ్జెట్ ను దారదత్తం చేయడం  నిబంధనలకు విరుద్దంగా అధికారులు చేసినా వ్యవహరం ఇప్పుడు తెరపైకి వచ్చింది. సాధారణంగా 2.5 లక్షల పైన కొనుగోళ్లు, సరఫరా విషయంలో టెండర్లు నిర్వహించడం సర్వసాదారణం. కానీ రూ.33 లక్షల విలువ చేసే టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ బుక్స్ కోసం ఎలాంటి టెండరింగ్ లేకుండానే కామారెడ్డికి చెందిన ఓ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా మార్చి నెలలో నిజామాబాద్ జిల్లాలోని 27 కస్తూర్భా గాంధీ విద్యాలయాల నుంచి మిగులు బడ్జెట్ ను సంబంధిత ఏజెన్సీకి ట్రాన్స్ ఫర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖ, ఎస్ఎస్ఏ అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు తమ వద్ద ఉన్న మిగులు బడ్జెట్ ను ట్రాన్స్ ఫర్ చేశారు. సాధారణంగా ఒక్కో కేజీబీవీకి విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రతియేటా రికార్డుల బుక్ ల కోసం రూ.80 వేలు మొదలుకుని లక్షా 25 వేల వరకు వెచ్చిస్తారు. దానిని అధికారుల ఆదేశాల మేరకు టెండర్లు నిర్వహించడం, అందులో తక్కువ ధరకు కోడ్ చేసిన వారికి టెండర్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈసారి అధికారులు ఏం జరిగిందో తెలియదు కానీ రూ.33 లక్షల టెండర్ల విషయంలో కామారెడ్డి వారికి అప్పగించడం అధికారుల ఆదేశాలతో తమ వద్ద ఉన్న మిగులు బడ్జెట్ మొత్తాన్ని ఏజెన్సీకే ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే ప్రస్తుత కొత్త విద్యా సంవత్సరంలో సర్వశిక్షా అభియన్ ప్రాజెక్టు ద్వారానే టీఎల్ఎం బుక్స్ లను ప్రభుత్వమే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయగా డబ్బులు తిరిగి చెల్లించేందుకు ఏజెన్సీ నిర్వాహకులు ఇప్పటి వరకు ముందుకు రాకపోవడంతో ఎస్ వోలలో ఆందోళన వ్యక్తమౌతుంది. నెల రోజుల్లో విద్య సంవత్సరం ప్రారంభం కానుండగా టీఎల్ఎం బుక్స్  లు ఏమి రాకుండానే డబ్బులు తీసుకున్న ఏజెన్సీ నిర్వాహకులు తిరిగి చెల్లించేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికారుల ఆదేశాలను పాటించి తమ వద్ద ఉన్న బడ్జెట్ తో ట్రాన్స్ ఫర్ చేస్తే తమ వద్ద చిల్లిగవ్వ లేదని వాపోతున్నారు. ఈ విషయంలో అధికారుల నిర్ణయంపై విమర్శలు వస్తుండగా విచారణ జరుపాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే విధంగా ఫైనాన్స్ క్లియరెన్స్ కాకుండానే ఎస్ వోల ద్వారా డబ్బులను ట్రాన్స్ ఫర్ వ్యవహరంలో జరిగిన మతలబు పై సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారులు విచారణ జరుపాలని అందులో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్ వోలు కోరుతున్నారు.

More articles

Latest article