బతుకమ్మ : నాగిరెడ్డిపేట : చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పాము కాటుతో వ్యక్తి మృతి చెందినట్లు స్థానిక ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం అచ్చాయి పల్లి గ్రామానికి చెందిన బెస్త అశోక్ (47) అనే వ్యక్తి ఆదివారం గ్రామ శివారులోని ఊర చెరువులోకి చేపలు పట్టడానికి వెళ్లి చెరువులో చేపల వలలు పరిచి చెరువు కట్టపై పడుకొని ఉండగా గుర్తు తెలియని విషపు పాము కాటు వేసినట్లు తెలవగానే అశోక్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం అశోక్ మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహానికి ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు, మృతుని భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై తెలిపారు.
