బతుకమ్మ భిక్కనూరు: భోజనం చేస్తుండగా కింద పడిపోయి చనిపోయిన సంఘటన కాచాపూర్ ఎల్లమ్మ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఎస్సై తెలిపిన సమాచారం ప్రకారం దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన గరిగంటి నరేష్( 33) తన స్నేహితులతో మద్యం సేవించి సాయంత్రం కాచపూర్ గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న శుభకార్యానికి వెళ్లి అక్కడ భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారి కింద పడిపోయాడు. తన స్నేహితులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ దావఖానకు తరలించగా డాక్టర్ చనిపోయాడని చెప్పాడు. ఆ సమాచారం అందుకున్న భిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.
