కామారెడ్డి, బతుకమ్మ: నాగిరెడ్డిపేట లో కేరళ స్కూల్ బిల్డింగ్ నిర్మాణ పనులు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 682/2 నంబర్ లో అనధికార నిర్మాణంలో చేపడుతూ ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) బఫర్ జోన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతోందని గ్రామ ప్రజలు అంటున్నారు. మొత్తం 16గుంటల భూమికి తహసీల్దార్ బుక్కా రాందాస్ నాలా కన్వర్షన్ ఇచ్చారు. అయితే సేల్ డీడ్ నం.557/2023 (తేదీ:26/06/23) ప్రకారం, మొత్తం భూమి 16 గుంటలు భూమిలో కొలతల ప్రకారం గ్రామ పంచాయతీ మంజూరు చేసిన అనుమతులు వేర్వేరు ప్లాట్ పరిమాణాల కొలతలను కలిగి 358.415, 357.29, 358.75 గజాలుగా పేర్కొన్నారు. అనుమతులు మంజూరు చేసిన వాటి ఆన్ లైన్ చలాన్ రెండు వేర్వేరుగా ఉండి ఒకటి మాత్రం రెండు చలాన్ రూపాయలు మాత్రం ఒకే విదంగా కనిపించడంతో,చలాన్ లపై,సర్వే నంబర్ 682/2 లో నీటిపారుదల శాఖ ద్వారా ఎన్ వోసీ జారీ చేయబడిందా లేదా అనేదానికి సంబంధించిన పూర్తి వివరాలపై డీఈ ని వివరణ కోరగా తమకు కానీ, ఏఈ లకు, జిల్లా అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నాలా మంజూరు ఎలా చేవారో తెలియదన్నారు. అలాగే తాము వారికీ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పంట పొలాల్లో ఉన్న కాలువ ను అనుకోని నిర్మాణం చేయడం ఎఫ్ టీ ఎల్ బఫర్ జోన్ వదలకుండా నిర్మాణం చేస్తున్నారు. కేరళ స్కూల్ యజమాని జిమ్మి నిర్మల గతంలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట్ రమణ రెడ్డి స్కూల్ లో పని చేసినట్లు సమాచారం. అందుకు జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అధికారులు ఆమెకు భయపడుతున్నట్లు తెలుస్తోంది. కేరళ స్కూల్ బిల్డింగ్ నిర్మాణ జరుగుతున్నట్లు తమకు తెలియదని మండల స్థాయి అధికారి పేర్కొనడం విడ్డూరం. అయితే ఈ నిర్మాణం జిల్లా పంచాయతీ రాజ్ అధికారికి తెలిసే జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.

