29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎస్సార్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లిన కారు

Must read

📰 Generate e-Paper Clip

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతు

వరంగల్ జిల్లాలో ఘటన

వెబ్ న్యూస్, బతుకమ్మ : వరంగల్ జిల్లా సంగెం (మం) తీగరాజుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎస్సార్ఎస్పీ కాలువలోకి శనివారం కారు దూసుకెళ్లింది. ఈఘటనలో  ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే..  మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు  మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ (30) భార్య ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ నుంచి కారులో స్వగ్రామానికి వస్తున్నారు. ఈక్రమంలో సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ప్రమాదవశాత్తు కారు ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది.  ఈక్రమంలో బాలుడు మృతి చెందగా, కారుతో పాటు తండ్రి, కూతురు గల్లంతయ్యారు.  గమినించి స్థానికులు తాడు సహాయంతో అతని భార్యను కాపాడారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ప్రవీణ్ కు  చెస్ట్ పెయిన్ రావడంతో ఈప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

More articles

Latest article